అంతా బూడిద

1059

సిటీ యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో ఏటీఎం కాలి బూడిదైంది. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానిక సిటీ యూనియన్ ‌బ్యాంక్‌ ఆవరణలో ఉన్న ఏటీఎం కేంద్రంలో మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఏటీఎం కేంద్రం నుంచి మంటలు రావడంతో కస్టమర్లు అక్కడినుంచి తీశారు. స్థానికంగా ఉన్న యువకులు సాహసం చేసి బకెట్లతో నీటిని తీసుకువచ్చి వెదజల్లడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిస్థాయిలో ఆర్పివేశారు. ఏటీఎంలో ఉన్న నగదు మంటల తాకిడికి కాలిపోయి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం విషయంపై బ్యాంకు అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నష్టంపై అంచనా వేస్తున్నారు.