అందుకే శాసన సభకు హాజరు కావడంలేదు..

537

అమ్ముడుపోయిన, కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు ఉన్న సభకు తాము హాజరు కావడం సముచితం కాదని అన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు టీడీపీ మంత్రి పదవులిచ్చిందని, ఫిరాయింపు దార్లు ప్రసంగిస్తే మేము వినాలా అంటూ ఆయన ప్రశ్నించారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా వారిని ఇంకా పదవుల్లో కొనసాగించడం సరికాదన్నారు. అందుకే తాము శాసన సభ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నామని చెప్పారు. ఫిరాయింపుల శాసన సభలో మేం ఉండదలచుకోలేదు, శాసన వ్యవస్థ పవిత్రతను టీడీపీ మంటగలిపిందని మండిపడ్డారు.