అగ్రిమెంట్ పూర్తయింది..

1408

కోవూరు ఎంపీపీ గిద్దలూరు ఉమ తన పదవికి రాజీనామా చేశారు. జడ్పీ సీఈవోను కలసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. టీడీపీ తరపున గెలిచిన ఉమ రెండున్నరేళ్ల క్రితం ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రెండున్నరేళ్ల పదవీకాలాన్ని మరో ఎంపీటీసీ దార గీతకు అప్పగించేలా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగానే ఎంపీపీ ఉమ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఆమె వెంట టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, స్థానిక నేతలు ఉన్నారు.