అడిగితే నేనే ఇచ్చేవాడిని కదా..

334

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పరువే లేదు, అలాంటి వ్యక్తి తనపై పరువునష్టం దావా వేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డికి ఏడాదికేడాది టార్గెట్లు ఉంటాయని, ఈ ఏడాది ఆ టార్గెట్లు తగ్గినందుకే తనపై దావా వేసి దాన్ని భర్తీ చేసినట్టు భావిస్తున్నారని చెప్పారు. చంద్రమోహన్ రెడ్డిపై తాను చేసిన ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు.