అపచారం.. అపచారం

355

తమిళనాడు నాగపట్నం జిల్లాలోని ఆలయంలో అమ్మవారికి చుడీదార్‌ అలంకరణ వ్యవహారం తీవ్ర విమర్శలకు, వివాదాలకు దారితీసింది. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైన ఈ వ్యవహారంపై సనాతన వాదులు మండిపడుతున్నారు. నాగపట్నం జిల్లా మయిలాడుదురైలో తిరువావడుదురై అధీనానికి చెందిన అభయాంబిక సమేత శ్రీమయూరనాథ ఆలయం ఉంది. శుక్రవారం అమ్మవారికి చందన అలంకారం నిర్వహించారు. సాయంత్రం చుడీదార్‌ ధరింపజేసి పూజలు చేశారు. ఇది భక్తులకు దిగ్భ్రాంతి కలిగించింది. ఆగమ నియమాలకు విరుద్ధంగా అలంకరించిన అర్చకులు రాజ్‌, కల్యాణంలను తిరువావడుదురై ఆధీనం సోమవారం సస్పెండ్‌ చేసింది.