అభివృద్ధి పథకాలకు అనూహ్య స్పందన -రాజగోపాల్ రెడ్డి

800

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు మంత్రి సోమిరెడ్డి తనయుడు రాజగోపాల్ రెడ్డి. ముత్తుకూరు అరుంధతీయవాడలో టీడీపీ సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోరువానను సైతం ప్రజలు లెక్కచేయకుండా రాజగోపాల్ రెడ్డి వెంట నడిచారు. అడుగడుగునా మంగళ హారతులిస్తూ పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి రిజర్వాయర్ డిస్ట్రీబ్యూటరీ చైర్మన్ ఈదూరు రామ్మోహన్ రెడ్డి‌, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.