అభివృద్ధి ముసుగులో అవినీతి..

276

ఓటుకు కోట్లు కేసులో దోషిగా ఉన్న చంద్రబాబు నాయుడు తాను నిజాయితీ పరుడిని అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి. అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలోకి వచ్చే సమయంలోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని అదే రీతిలో టీడీపీలోకి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తారా అని ప్రశ్నించారు. వైసీపీలో గెలిచి పార్టీ ఫిరాయించిన 21మంది చేత రాజీనామా చేయిస్తారా అంటూ సవాల్ విసిరారు. విలువలు, నిజాయితీ, నీతి గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ నేతలకు లేదని అన్నారు.