అసలు నిజం ఇదేనా..

2011

నెల్లూరులో సుధాకర్ మహారాజ్ పేరుతొ దొంగబాబా అవతారమెత్తిన సుధాకర్ మోసాల్లో మన విద్యాశాఖ పాపం కూడా వుంది. ఇప్పటికీ సూళ్లురుపేట మండలం, సుద్దమడుగు ప్రాధమిక పాఠశాలలో రికార్డుల్లో వున్న సుధాకర్, నెల్లూరులో ఆశ్రమం పెట్టి, మోసాలు చేస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. సుధాకర్ బాబాకు ఇంతకాలం విద్యాశాఖ, జడ్పీ అధికారులు సెలవు ఎలా మంజూరు చేశారో అర్ధం కాని పరిస్థితి. ఒకపక్క ఆశ్రమంలో మోసాలు చేస్తూ,పూజలు, యజ్ఞాలు, హోమాల పేరుతొ పత్రికల్లో ఫోటోలు వేయించుకుంటూ కనిపించే సుధాకర్, మెడికల్ లీవ్ పేరుతో విధులకు ఎగనామం పెట్టిన విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సుధాకర్ కు మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ ఎవరో, దాని ఆధారంగా సెలవు మంజూరు చేసిన అధికారి ఎవరో ఇప్పుడు తేలాల్సి వుంది. ఇదిలా ఉండగా సుధాకర్ కు మెడికల్ లీవ్ విషయంలో, సూళ్లూరుపేట MEO ఉదయ్ కుమార్ కు ఇప్పుడు అధికారులు మెమో జారీ చేశారు. తాజాగా ఉదయ్ కుమార్ మృతి చెందాడు. సుధాకర్ విషయంలో వివాదం తలెత్తడంతో, ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగానే ఉదయ్ కుమార్ చనిపోయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.