ఆకట్టుకున్న చిన్నారుల ఆటాపాటా..

862

నెల్లూరులోని నక్షత్ర స్కూల్, ఏరో కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు తమ ఆటపాటలతో ఆకట్టుకున్నారు. స్కూల్ రెండో వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరులోని పీవీఆర్ కల్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కృష్ణం వందే జగద్గురుం స్కిట్ అదరహో అనిపించింది.