ఆకలితో అలమటించిన విద్యార్థులు..

278

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బాలికల హైస్కూల్ లో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనంలో బల్లి కనపడింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు లోనయ్యారు. దీంతో విద్యార్థులకు ఆ భోజనాన్ని వడ్డించకుండా నిలిపివేశారు ఉపాధ్యాయులు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో మధ్యాహ్న భోజనం లేక పిల్లలు ఆకలితో అలమటించాల్సి వచ్చింది. అప్పటికే పదోతరగతి విద్యార్థిని పొరపాటున బల్లిపడిన భోజనం చేసింది. ఆ అమ్మాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.