ఆగస్ట్ 9నుంచి 17వరకు ఆలయం మూసివేత..

1782

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9వ తేదీ నుంచి 17 వరకు 9 రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయనుంది. తిరుమలలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమంపై చర్చించేందుకు ఛైర్మన్‌ పుట్టాసుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కాసేపటి క్రితం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 9వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు భక్తుల రాకను నిలిపివేయనున్నారు. మహా సంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.