ఆటపాటలతో ఆకట్టుకున్న చిన్నారులు..

334

పొదలకూరు పట్టణంలోని నాగార్జున స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. పొదలకూరు ఎంఈవో బాలకృష్ణారెడ్డి, నెల్లూరు అకడమిక్ మానిటరింగ్ అధికారి అబ్దుల్ హమీద్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తోట మనోహర్, పొదలకూరు సర్పంచి తెనాలి నిర్మల ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుుగా హాజరయ్యారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, క్రీడా పోటీల్లో విజేతలకు ఈ సందర్భంగా మొమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. పాఠశాల అడ్వైజర్లు ఎన్.బాల సుబ్రహ్మణ్యం, ఎన్.గాయత్రీ దేవి, ప్రిన్సిపల్ ఎన్.లక్ష్మీదుర్గ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు.