ఆత్మకూరులో విషాదం..

1444

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అశ్వినీపురం గ్రామంలో వేడినీటికోసం హీటర్ పెట్టుకున్న ఓ మహిళ విద్యుత్ షాక్ తో మృతిచెందింది. బకెట్ లో హీటర్ పెట్టిన మహిళ, తిరిగి దాన్ని తీసే క్రమంలో విద్యుత్ షాక్ కి గురయింది. దీంతో ఆమె అక్కడికక్కడే విలవిల్లాడుతూ కిందపడిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. మృతురాలి పేరు వెంకట శేషమ్మ, వయసు 47 సంవత్సరాలు. ఈమెకు ఇద్దరు కుమార్తెలున్నారు.