ఆలస్యమైనమాట వాస్తవమే.. కానీ!

1469

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం కాస్త విరామం తర్వాత తిరిగి మొదలైంది. అన్ని నియోజకవర్గాలతో పోల్చి చూస్తే ఆత్మకూరులో ఈ కార్యక్రమం ఆలస్యంగానే ప్రారంభమైంది. పార్టీ అంతర్గత వ్యవహారాలతో అలకబూనిన ఆనం రామనారాయణ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలసిన అనంతరం నియోజకవర్గంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏకధాటిగా ఐదురోజులపాటు కార్యకర్తల సమావేశం, ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత దసరా సెలవలు, వర్షాల కారణంగా కార్యక్రమానికి బ్రేక్ పడింది. తాజాగా రెండో దఫా ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని చేజర్ల మండలంలో ప్రారంభించారు ఆనం రామనారాయణ రెడ్డి. టీకేపాడు గ్రామంలో పర్యటించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పార్టీలకతీతంగా అభివృద్ధి పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని, చంద్రబాబు ఆశయం కూడా ఇదేనని చెప్పారు రామనారాయణ. ఇంటింటికీ కార్యక్రమాన్నిఇకపై వేగవంతం చేస్తామని తెలిపారు.