ఇక పోరుబాటే..

544

రిలయన్స్ థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం భూములు సేకరించిన ప్రభుత్వం.. వాటిని రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. రిలయన్స్ థర్మల్ ప్రాజెక్ట్ ఏర్పాటు కావడంలేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించిన నేపథ్యంలో వాటిని తిరిగి రైతులకు ఇచ్చేయాలని అన్నారాయన. కృష్ణపట్నం ప్రాంతంలో రిలయన్స్ సేకరించిన భూములను కాకాణి పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఆయన, ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వం దౌర్జన్యానికి దిగితే తొలిదెబ్బ తనపైనే పడుతుందని, ప్రజల పక్షాన పోరాడటానికి తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించారు.