ఇద్దరమ్మాయిలు మృతి..

1677

వాకాడు మండలం తూపిలిపాళెంలో తీరంలో విషాదం చోటుచేసుకుంది. కోటకు చెందిన ఇద్దరు టీనేజీ అమ్మాయిలు రమ్య(13), రోషిణి(14) సముద్ర స్నానానికి వెళ్లి మునిగిపోయారు. ఓవైపు తుపాను కారణంగా సముద్రం ఉగ్రరూపంలో ఉందని అధికారులు హెచ్చరిస్తున్నా ఈటైమ్ లో సముద్ర స్నానానికి వెళ్లారు వీరిద్దరూ. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అలల ఆటుపోట్లకు ఇద్దరమ్మాయిలూ సముద్రంలో కొట్టుకుపోయారు. కాసేపటికి ఆ బాలికల శవాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి.