ఇద్దరు యువకులు దుర్మరణం..

1592

నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓజిలి నుంచి నాయుడుపేట వైపు వెళ్ళుతున్న బైక్ ను చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్ళుతున్న మహేంద్ర జైలో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్ళుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వాకాటి శ్రీనువాసులు(35), గాడి నాగరాజు(32)లుగా పోలీసులు గుర్తించారు. వీరు గూడూరు మండలం చెన్నూరు వాసులు. వీరికి వివాహమై పిల్లలు ఉన్నారు. గూడూరులోని నెల్ కాస్ట్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కోసం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.