ఇస్రో అరుదైన ఘనత

691

శ్రీహరికోట, మే-23: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అరుదైన ఘనత సాధించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) నుంచి పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక(ఆర్‌ఎల్వీ)ని విజయవంతంగా ప్రయోగించింది. సరిగ్గా ఉదయం 7 గంటలకు నింగిలో దూసుకెళ్లిన రాకెట్ 70 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. 11 నిమిషాల వ్యవధిలోనే బంగాళాఖాతంలో ఏర్పాటుచేసిన వర్చువల్‌ రన్‌వేపై సురక్షితంగా దిగింది. ఇస్రో ఈ తరహా రాకెట్‌ను ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష ప్రయోగాల వ్యయం పదిరెట్లు తగ్గుతుందని తెలిపారు ఇస్రో శాస్త్రవేత్తలు.