ఎంతటి అద్భుతమైన చిత్రం..!

502

తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మహానటి సినిమా టీంను అభినందించారు. గత రాత్రి ఆయన ఈ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ఎంతటి అద్భుతమైన చిత్రం! ‘మహానటి’ సినిమా చూసి దిమ్మతిరిగిపోయింది. కీర్తి సురేశ్‌ సావిత్రి పాత్రలో జీవించేశారు. అద్భుతమైన ప్రదర్శన. ఆమె సినిమాను గొప్పగా తెరకెక్కించిన నాగ్‌ అశ్విన్‌కు, నిర్మాత స్వప్న దత్‌కు‌ నా అభినందనలు. సమంత, విజయ్‌ దేవరకొండ, నాగ చైతన్య చాలా బాగా నటించారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.