ఎరలేదు, వల అక్కర్లేదు..

885

ఎర వేయకుండానే చేపలు పడుతున్నారు యువకులు. వల అక్కర్లేకుండానే కేవలం చేతులు అడ్డం పెడితేనే చేపలు గుట్టలు గుట్టలుగా వచ్చి పడుతున్నాయి. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలతో ఎక్కడికక్కడ చెరువులు, కుంటల్లోకి నీరు చేరుకుంటోంది. జలకళ పెరగడంతోపాటు, చేపలు కూడా వచ్చిపడుతున్నాయి. దీంతో వెంకటగిరిలో యువత సరదాగా చేపల వేటతో సేదతీరుతున్నారు. చుట్టుపక్కల కుంటల్లోనుంచి వస్తున్న వర్షపు నీరు స్థానిక డ్రైనేజీల్లో కలుస్తుండటంతో చిన్నచిన్న చేపలు ఆ వాననీటి ప్రవాహంతోనే కొట్టుకుని వస్తున్నాయి. దీంతో ఎర లేకుండానే, వల అక్కర్లేకుండానే వెంకటగిరి క్రాస్ రోడ్స్ దగ్గర చేపలు పడుతున్నారు స్థానికులు.