ఏడుకొండలవాడికి 8కోట్ల హారం

496

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి 8కోట్ల 39లక్షల రూపాయల విలువ చేసే సహస్ర నామావళి హారాన్ని ఎన్నారై భక్తుడు మంతెన రామలింగరాజు సమర్పించుకున్నారు. ఈ హారంలో బంగారం విలువ 8కోట్ల 11లక్షల 51వేలు కాగా, దాని తయారీకి కూలీకింద 27లక్షల 50వేల రూపాయలు అయింది. 28కిలోల బంగారం ఈ హారం తయారీకోసం వినియోగించారు. 1008 కాసులపై స్వామివారి సహస్ర నామాలు లిఖించారు. 5పేటల ఈ హారంలో మొదటి హారంలో 184 కాసులు, రెండో హారంలో 192 కాసులు, మూడో హారంలో 201 కాసులు నాలుగో హారంలో 212 కాసులు, 5వ హారంలో 219 కాసులు ఉన్నాయి. తిరుపతిలోని GRT జ్యువెలరీ ఈ హారాన్ని తయారు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీన్ని స్వామివారికి దాతలు అంకితం చేశారు.

tml