ఓ సుజాత కన్నీటి గాథ..

1359

భర్తను పోగొట్టుకుని బిడ్డలతో, వైధవ్యంతో కుమిలిపోతున్న ఓ మహిళను బావ వరసైన హెడ్ కానిస్టేబుల్ నానా చిత్ర హింసలు పెడుతున్నఘోరమిది. దొరవారి సత్రం మండలం నెలబలి గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ భర్త ఇటీవలే చనిపోయాడు. ఆ తర్వాత మృతుడి అన్న సుజాతకు వరసకు బావ అయిన మునీందర్ రెడ్డి వచ్చి తమ్ముడికి సంబంధించిన ప్రామిసరీ నోట్లు, నగలు, నగదు అన్నీ స్వాధీనం చేసుకుని ఆమెను ఇంటిలోనుంచి గెంటివేసేందుకు ప్రయత్నం చేశాడు. ఇదేమని అన్యాయం అని అడిగిన వారిని తన పోలీసు దౌర్జన్యంతో బెదిరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మునీందర్ రెడ్డి ప్రస్తుతం మెరైన్ హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నాడు. పోలీసుని అన్న పొగరుతో రౌడీయిజం చేస్తున్న మునీందర్ రెడ్డిపై ఎస్పీకి మొరపెట్టుకునేందుకు సుజాత, గ్రీవెన్స్ సెల్ కి వచ్చింది.