కన్యాదానం..

1208

పెళ్లైన మొదటి రాత్రే తన ప్రేమ వ్యవహారాన్ని భర్తకు చెప్పింది భార్య. అయితే ఆ భర్త ఆమెను తిట్టలేదు, కొట్టలేదు. పైగా తొలిరాత్రే ధైర్యంగా తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పినందుకు మెచ్చుకున్నాడు. కాపురాలు కూలిపోకుండా, ఎవరి జీవితాలు నష్టపోకుండా ఓ నిర్ణయం తీసుకున్నాడు. వారం తిలిగే లోపే భార్యను ఆమె ప్రియుడికే ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. సుందర్‌ఘడ్ జిల్లాలోని పామర గ్రామానికి చెందిన బాసుదేవ్ టప్పో(28) అనే వ్యక్తి జార్సుగూడ ధేబ్బి గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతిని ఈ నెల 4న వివాహం చేసుకున్నాడు. తన భార్య వేరే యువకుడిని ప్రేమిస్తుందని తెలుకున్న టప్పో వారిద్దరిని ఒక్కటి చేయాలని నిర్ణయించుకున్నాడు. తన భార్య తల్లిదండ్రులు, సోదరులతో మాట్లాడి వారిని ఒప్పించాడు. గ్రామ సర్పంచ్‌ సమక్షంలో వారికి మళ్లీ వివాహం జరిపించాడు. ఈ పెళ్లి జరగకుంటే ముగ్గురి జీవితాలు నాశనం అయ్యేవని టప్పో చెప్పాడు.