కమాండ్ కంట్రోల్ రూమ్ కు కావలి అనుసంధానం

683

కావలి, సెప్టెంబర్-20: కావలిలో సీసీ కెమెరాల ఏర్పాటుని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కి కావలి అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. కావలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఎస్పీ, అక్రమాలకు పాల్పడితే ఖాకీలపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తగిన ఆధారాలతో బాధితులు తమ వద్దకు వస్తే అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరినీ ఉపేక్షించబోమని చెప్పారు.