కావలిలో కారు ప్రమాదం..

1774

నెల్లూరు జిల్లా, కావలి మండలం గౌరవరం వద్ద బస్సు ఢీకొనడంతో కారు ముందుభాగం నుజ్జు నుజ్జయింది. కారులో ఉన్నవారు మృత్యు ముఖం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు చర్లపల్లి నుంచి చెన్నై వెళ్తోంది, బస్సు కావలి వైపు వెళ్తోంది. బస్సు రాంగ్ రూట్ లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు కారు యజమాని. బస్సు ఢీకొనడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ కి గురయ్యారు. తేరుకుని చూస్తే కారు పూర్తిగా డ్యామేజీ అయింది, అయితే ప్రాణాలకు ప్రమాదం లేకపోవడంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ బైటపడ్డారు.