కావలిలో దారుణం..

893

కట్టుకున్న భర్తే భార్య పాలిట కాలయముడయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై అతి కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. భార్య గొంతుకోశాడు. నెల్లూరు జిల్లా కావలి మండలం నడుంపల్లిలో ఈ దారుణం జరిగింది. ఆ కిరాతకుడి పేరు శ్రీను. భర్త చేతిలో దాడికి గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ బాధితురాలి పేరు అరుణ. ప్రస్తుతం ఈమె కావలి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.