కుటుంబాన్ని చిదిమేసిన అనుమాన భూతం..

965

భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త హంతకుడిగా మారాడు. 18ఏళ్లుగా తనతో కాపురం చేసిన భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపేశాడు. ఇద్దరు కూతుళ్లను అనాధలుగా చేశాడు. బుచ్చిరెడ్డిపాలెం కాగులపాడు పాత హరిజనవాడలో జరిగి కెజియమ్మ హత్యకు అసలు కారణం అనుమాన భూతమని తేల్చారు పోలీసులు, నిందితుడు అశోక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మరణించడం, తండ్రి పరారీలో ఉండటంతో ఇద్దరు కూతుళ్లు కుమిలిపోతున్నారు. ప్రస్తుతం బంధువుల సంరక్షణలో ఉన్నారు.