కృష్ణా మృతుల అంత్యక్రియలు పూర్తి..

727

భక్తిపేరుతో ప్రభుత్వం చేస్తున్న వ్యాపారం వల్లే కృష్ణానది బోటు ప్రమాదం వంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు సీపీ నేత నారాయణ. నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కురుగొండలో తన సోదరి అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు. నారాయణ సోదరి లలితాదేవి సహా ఆమె కోడలు హరిత, మనవరాలు అశ్విత ఈ ప్రమాదంలో దుర్మరణఁ పాలయ్యారు. లలితాదేవి కుమారుడు ప్రభు కిరణ్ ప్రైవేటు కాలేజీలో ఉద్యోగం చేస్తున్నందున్న గత పది సంవత్సరాలుగా వారు విజయవాడలో నివాసం ఉంటున్నారు. బోటు ప్రమాదంలో ముగ్గురు నీటిలో పడి మరణించారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించడంతో బంధువులు కురుగొండకు వచ్చి నివాళులర్పించారు. వీరి అంత్య క్రియలకు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఇతర అధికారులు హాజరయ్యారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కూడా మృతుల కుటుంబాన్ని పరామర్శించారు.