కొత్త చట్టం వచ్చేస్తోంది..

2246

ర‌క్త‌మాంసాలు ధార‌పోసి పెంచిన త‌ల్లిదండ్రుల‌ను వృద్దాప్యంలోకి రాగానే బిడ్డ‌లు వారిని చివ‌రిద‌శ‌లో వ‌దిలివేసే సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లుగా చూస్తూనే వున్నాం. త‌ల్లిదండ్రుల‌ను నిరాద‌రించే బిడ్డ‌ల‌కు జైలు శిక్ష‌ను మూడు నెల‌ల నుంచి ఆరు నెల‌ల‌కు పెంచాల‌ని కేంద్ర సామాజిక న్యాయ మ‌రియు సాధికార మంత్రిత్వ శాఖ ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసింది. ఇందుకోసం త‌ల్లిదండ్రుల సంక్షేమం మ‌రియు వృద్దుల చ‌ట్టం-2007ను స‌వ‌రిస్తున్నారు. ఇందులో ఇప్ప‌టివ‌ర‌కు పిల్ల‌లు అన్న ప‌దాన్ని కేవ‌లం కొడుకులు మ‌న‌వ‌ళ్ళ‌తోనే నిర్వ‌చించారు. ఇప్పుడు దాన్ని మ‌రింత విస్తృత ప‌రుస్తూ ద‌త్తపుత్రులు, స‌వ‌తి బిడ్డ‌లు, అల్లుళ్ళు, కూతుళ్ళు, కోడ‌ళ్ళు, మ‌న‌వ‌రాళ్ళు ఇలా ర‌క్త‌సంబంధీకుల వారి అన్ని ర‌కాల బంధుత్వాన్ని, సంత‌తిని పిల్ల‌లు అనే నిర్వ‌చ‌నం ప‌రిధిలోకి చేర్చారు. వృద్దులైన త‌ల్లిదండ్రుల‌కు నెల‌వారీ ఇవ్వాల్సిన గ‌రిష్ట ప‌రిమితిని 10వేల నుంచి పెంచ‌నున్నారు. త్వ‌ర‌లో ఈ విష‌యాన్ని పార్ల‌మెంట్ ముందుకు తీసుకురానున్నారు.