కొనసాగుతున్న దర్యాప్తు..

658

బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన కెనరా బ్యాంక్ ఏటీఎం దోపిడీలో దుండగులు నగదు తీసుకెళ్లలేదని బ్యాంక్ మేనేజర్ మురళి స్పష్టం చేశారు. కెనరా బ్యాంక్ ఏటీఎంలోని నగదు చోరీకి గత రాత్రి విఫల యత్నం జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంలోని సీసీ కెమెరాను ధ్వంసం చేసి గదిలోని ఏటీఎం మిషన్ ను పెకళించి బయటపడేశారు. సంఘటనా స్థలానికి స్థానిక పోలీసులతో పాటు క్లూస్ టీం చేరుకొని వివరాలను సేకరించారు.ఈ ఘటనలో దుండగులు ఎటువంటి నగదును తీసుకెళ్లలేదని బ్యాంక్ మేనేజర్ మురళి తెలిపారు. సీసీ ఫుటేజీ లతోపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి త్వరలో నిందితులను పట్టుకుంటామని బుచ్చి SI నాగ శివా రెడ్డి తెలిపారు.