కోర్టుకెక్కిన రోజా..

2912

మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోర్టుకెక్కారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఈమేరకు వివేకాపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. రోజా ఫిర్యాదుని పరిశీలించిన కోర్ట్ ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఆనం వివేకానందరెడ్డికి సమన్లు జారీ చేసింది. మార్చి-8న వివేకా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలిచ్చింది. అసలు రోజాపై ఆనం వివేకా చేసిన వ్యాఖ్యలేంటి? రోజా ఎందుకంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు? అసలప్పుడు ఆనం వివేకా ఏమన్నారో ఓసారి మళ్లీ విందాం?