కోవూరులో ఇసుక మాఫియా..

561

కోవూరు మండలం, జమ్మిపాలెంలో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు గ్రామ ప్రజలు. నిత్యం అధిక లోడుతో, విపరీతమైన వేగంతో ట్రాక్టర్లు తిరుగుతూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయని మండి పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. పిల్లలను స్కూళ్లకు పంపాలంటేనే హడలిపోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు. బయటకు వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చే వరకూ భయంభయంగా గడపాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలని వేడుకొంటున్నారు.