గూడూరులో ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

493

నమ్మలేని నిజం. మోసగాడి ఆడియో టేపు వినండి. ఇదేదో సినిమా కాదు, బహుశా ఇంత వరకు ఈ కాన్సెప్ట్ తో సినిమా కూడా రాలేదు. ఒకవేళ ఈ గూడూరు లవ్ స్టోరీ వింటే రామ్ గోపాల్ వర్మో, మరొకడో దీన్ని కచ్చితంగా కథగా మలచుకుని సినిమా తీసే అవకాశం ఉంది. సినిమా వాళ్లకే రాని వికృతమైన ఊహలు, కాన్సెప్ట్ లు గూడూరులో ఒక ప్రేమికుడికి వచ్చాయి. వాడి ఉన్మాదం, అమాయకురాలైన శృతిని బలితీసుకుంది.
గూడూరులో ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థిని శృతి ఫోన్ రికార్డింగ్ వాయిస్ ఒకటి బయటికొచ్చింది. అందులో ఆమె బబ్లూ అనే ఓ అబ్బాయిని ఇష్టపడినట్టు తెలుస్తోంది. అయితే సదరు బబ్లూకి మరో అమ్మాయితో కూడా పరిచయం ఉంది. ఈ ఇద్దరమ్మాయిల్లో ఎవరినో ఒకర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న బబ్లూ.. ఇద్దరితోపాటు, తనకి అక్క వరసయ్యే మరో అమ్మాయితో కూడా అతను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడు. జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుంటానని, మరో ఐదేళ్లు వెయిట్ చేస్తే మీలో ఎవరు మంచి పొజిషన్లో ఉంటారో వారినే తన తమ్ముడు పెళ్లి చేసుకుంటాడంటూ కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్న అక్క కండిషన్ పెట్టడం, దానికి తమ్ముడు సరే అనడం విచిత్రమే కాదు వికృతం కూడా. ఇటువంటి నీఛుడ్ని ఏం చేయాల్నో ఆడ పుట్టుక పుట్టిన వాడి అక్కను ఏం చేస్తే పాపం పరిష్కారమవుతుందో దేవుడికే తెలియాలి.