గూడూరులో హీరో శ్రీకాంత్ పూజలు..

1829

సినీహీరో శ్రీకాంత్ గూడూరుకు వచ్చారు. గూడూరు పట్టణంలోని సాయి సత్సంగ నిలయంలో సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు జిల్లా కో-ఆర్డినేటర్‌, సాయిసత్సంగం నిర్వాహకులు కోట సునీల్‌కుమార్‌ శ్రీకాంత్ కు స్వాగతం పలికారు. తాను నటించిన రా రా సినిమా విజయవంతం కావాలని భగవంతున్ని కోరుకున్నట్టు తెలిపారు శ్రీకాంత్. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ ను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.