గెలుపు మాదే..

227

ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. దీనికి నిదర్శనం గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న జనాదరణే అని చెప్పారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా నెల్లూరులో స్థానిక నేతలు, కార్యకర్తలతో కలసి ఆయన సంఘీభావ యాత్ర చేపట్టారు. కొత్తూరులో ఈ యాత్ర కొనసాగింది. మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంఘీభావ యాత్రలో పాల్గొన్నారు.