గోడపై సాయిబాబా రూపం..

255

షిరిడిలో ద్వారకామాయిలో గోడమీద సాయిబాబా రూపం కనపడటం సంచలనం రేపింది. ఈ వార్త తెలిసిన వెంటనే చుట్టుపక్కల ప్రజలు, అక్కడకు పోయిన భక్తులు ద్వారకామాయిని సందర్శించుకుని బాబా రూపం కనిపించిన గోడవద్ద పూజలు చేస్తున్నారు. ద్వారకామాయిలో ధుని పక్కనే ఉన్న గోడపై బుధవారంనాడు పలు సందర్భాల్లో సాయిబాబా రూపం కనిపించింది. దీన్ని అనేకమంది భక్తులు ప్రత్యక్షంగా చూడటం, తమ సెల్ ఫోన్ లలో ఫొటోలు తీయడం జరిగింది. బుధవారం సాయంత్రం కూడా మూడు దఫాలు ఇలా సాయిబాబా రూపం గోడమీద ప్రత్యక్షమై ఆ తర్వాత మాయమైంది. పదే పదే బాబా గోడమీద ఒకే ప్రాంతంలో ప్రత్యక్షం కావడంతో భక్తుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఈ విషయమై నేషనల్ టీవీ ఛానెల్స్ కూడా షిరిడికి చేరుకుని ప్రత్యేక వార్తా కథనాలు, బాబా రూపాన్ని గోడపై ప్రత్యక్షంగా చూసిన వారి అనుభవాలను ప్రసారం చేస్తున్నాయి.