గోవిందా – గోవిందా..

905

కలిగిరి, జులై-2: కలిగిరిలోని ప్రధాన రహదారిపై ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం తలుపులు ధ్వంసం చేసి స్వామివారి అలంకరణ సామగ్రి, ఆభరణాలు, హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదు అపహరించారు దుండగులు. రాగి పళ్లెంలు, పంచ పాత్రల్ని కూడా వదిలిపెట్టలేదు, మొత్తం ఊడ్చేశారు. రాత్రి పవలింపు సేవల సందర్భంగా స్వామివారికి అలంకరణ జరిపి, తెల్లవారిన తర్వాత వచ్చి చూసే సరికి అన్నీ మాయమైపోయాయని చెబుతున్నారు పూజారులు.