ఘన స్వాగతం

372

రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ తొలిసారిగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ కు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. రేపు ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.