ఘరానా దొంగ అరెస్ట్..

568

నెల్లూరు, ఫిబ్రవరి-15: 44.5 సవర్ల బంగారు ఆభరణాలు, 750 గ్రాముల వెండి, 10వేల రూపాయల క్యాష్. ఇదేదో దొంగల ముఠా చేసిన పని కాదు. సింగిల్ హ్యాండ్ తో రమేష్ అనే కారుడ్రైవర్ చేసిన దొంగతనాల చిట్టా ఇది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన ఈరి రమేష్ కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. చెడు వ్యసనాలకు బానిసైన రమేష్ ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. జల్సాలకోసం దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. నెల్లూరు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసుల కంటిమీద కునుకులేకుండా చేశాడు రమేష్. తడ, సూళ్లూరుపేట, దొరవారి సత్రం ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇటీవల నిఘా పెంచిన పోలీసులు ఎట్టకేలకు రమేష్ ని అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో ఏఎస్పీ రెడ్డిగంగాధర్, రమేష్ నేరచరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ శ్రీనివాస్, సూళ్లూరుపేట సీఐ విజయకృష్ణ, ఎస్సై గంగాధరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.