చాటింగ్ సోగ్గాడు సస్పెండ్..

3451

సైదాపురం ఎస్సై ఏడుకొండలను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సస్పెండ్ చేశారు. జిల్లా ఎస్పీ పి.హెచ్.డి. రామకృష్ణ నివేదిక ప్రకారం ఏడుకొండలను సస్పెండ్ చేసి, జిల్లా హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని, అనుమతి లేకుండా బయటకు కదల వద్దని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా ప్రవర్తించడాన్ని ప్రస్తావించారు. ఊటుకూరు సర్పంచి పద్మజతో ఫోన్ లో అసభ్యంగా మాట్లాడటం, తన వాంఛలకు ఆమెను లొంగాల్సిందిగా కోరడం, ఆమె భర్త, బంధువులపై కేసులు పెట్టి రిమాండ్ కి పంపడాన్ని ఫిర్యాదుదారుల పిటిషన్ ఆధారంగా ఈ సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఉదహరించారు.

WhatsApp Image 2017-10-20 at 1.54.39 PM WhatsApp Image 2017-10-20 at 1.54.42 PM