చావుబతుకుల్లో ఇద్దరు వ్యక్తులు..

4416

ఆర్టీసీ బస్సు, బైక్ ని ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఆర్టీసీ డిపో ఎదుట మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బస్సు బైటకు రావడంతోనే బైక్ ని ఢీకొంది. బస్సు ముందు చక్రాల కింద బైక్ పడిపోయింది. హెడ్ ల్యాంప్ పగిలిపోయింది, సీట్ ఎగిరిపడింది. బైక్ పైనున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై రక్తపు మరకలు ఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి. గాయపడ్డవారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.