చీరల కొట్టులో చోరీ..

3329

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో పట్ట పగలు ఓ బట్టల దుకాణంలో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు మహిళా దొంగలను పట్టుకుని దేహశుద్ది చేశారు దుకాణదారులు. బట్టలు కొనుకొనేందుకు వచ్చినట్టుగా నటిస్తు దాదాపు ఇరవై వేల రూపాయలు విలువ చేసే బట్టలను అపహరించేందుకు ప్రయత్నించారు. ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు మహిళ దొంగబ్యాచ్ షాపులోకి రాగా వారిలో మహిళలు మాత్రమే పట్టుబడ్డారు. మగ దొంగలు మాత్రం తప్పించుకొని పారిపోయారు. పట్టుబడిన మహిళా దొంగలకు దేహశుద్ది చేసి షాపు యాజమాన్యం పోలీసులకు అప్పగించారు.