చూసి కొనండి..

953

పండ్ల మీద స్టికర్స్ ను గమనించారా? ఆ స్టికర్స్ ను బట్టి వాటి గురించి చెప్పొచ్చు.!

మీరెప్పుడైనా పండ్లను కొనుగోలు చేసేటప్పుడు వాటిపై పలు సంఖ్యలతో కూడిన స్టిక్కర్లు ఉంటాయి గమనించారా..?
వాటిని మీరు చూసే ఉంటారు. కానీ వాటి గురించి మీకు తెలిసి ఉండదు. అయితే అవే సంఖ్యలు పైన చెప్పిన సమాచారాన్ని తెలియజేస్తాయి.
అంటే ఆ పండ్లను సహజ సిద్ధంగా పండించారా, లేదంటే రసాయనాలు వాడి పండించారా అనే సమాచారాన్ని ఆ స్టిక్కర్లు తెలియజేస్తాయి. అది ఎలా తెలుసుకోవాలంటే.
3 లేదా 4 అంకెతో నంబర్ ఉంటే.
పండ్లపై వేసే స్టిక్కర్ల మీద నాలుగు అంకెల నంబర్ ఉండి, ఆ నంబర్ 3 లేదా 4 తో ప్రారంభమైతే అప్పుడు ఆ పండ్లను కృత్రిమ రసాయనాలు, సహజ సిద్ధ ఎరువులు వాడి పండించారని తెలుసుకోవాలి. సాధారణంగా అలాంటి స్టిక్కర్లు ఉన్న పండ్లను 20వ శతాబ్దంలో వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల ఆధారంగా, నూతన పద్ధతులను ఉపయోగించి పండించారని తెలుసుకోవాలి.
9 అంకెతో నంబర్ ఉంటే.
పండ్లపై వేసే స్టిక్కర్ మీద ఐదంకెల నంబర్ ఉండి అది 9తో ప్రారంభమైతే అప్పుడు ఆ పండ్లను పూర్తిగా సేంద్రీయ ఎరువులను ఉపయోగించి అత్యంత సహజ సిద్ధమైన పద్ధతిలో పండించారని అర్థం చేసుకోవాలి. ఇవి మన శరీరానికి ఎలాంటి హాని కలిగించవు. పూర్తిగా సురక్షితమైనవి.
8 అంకెతో నంబర్ ఉంటే.
అదే పండ్లపై వేసే స్టిక్కర్ మీద ఐదంకెల నంబర్ ఉండి అది 8తో ప్రారంభమైతే అప్పుడు ఆ పండ్లను జన్యువుల మార్పిడితో పండించారని తెలుసుకోవాలి. ఇలాంటి పండ్లను అస్సలు తినకూడదు. అవి చాలా ప్రమాదకరం. అనారోగ్యాలను కలిగిస్తాయి.

ఇప్పుడు తెలిసిందిగా.. సో ఇక మీదట ఫ్రూట్స్ కొనేటప్పుడు జాగ్రత్త గా చూసి కొనండి.