ఛాన్స్ ఇస్తానని చెప్పి.. ఆపై..అదేపనిగా..

643

నటిగా, మోడల్‌గా రాణించాలని ఆశపడిన ఒక 23 ఏళ్ల యువతిని వేధించి, ఆమెపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడిన ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ ముంబయిలోని సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అసభ్యకరమైన ఆమె ఫోటోలను ఆమె భర్తకు, తాను పనిచేసే సంస్థ యజమానికి కూడా నిందితుడు పంపించినట్లు నిర్ధారించిన కోర్టు నిందితుడికి రూ.1.31 లక్షల జరిమానా విధించి బాధితురాలికి రూ 1 లక్ష చెల్లించాలని ఆదేశించింది. నాసిక్‌లోని సపూతరలో పనిచేసే ఆ యువతి భర్త తన భార్యకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలను చూసి తన భార్యను, చంటిబిడ్డను వదిలివేశాడు.