జిల్లాకు చేరిన మౌనిక మృతదేహం..

15739

చెన్నైలోని సత్యభామ వర్సిటీలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రాగ మౌనిక మృతదేహం ఆమె స్వస్థలమైన నెల్లూరు జిల్లా డక్కిలి మండలం మాటుమడుగుకి చేర్చారు. మృతదేహాన్ని చూసి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. చెన్నైలోని సత్యభామ వర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతున్న రాగ మౌనిక ఇంటర్నల్ ఎగ్జామ్ లో కాపీ కొట్టిందనే కారణంతో ఎగ్జామినర్ బైటకు పంపించేశారు, ఆ తర్వాతి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీన్ని అవమానంగా భావించిన మౌనిక హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన స్నేహితులకు మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని మెసేజ్ పెట్టింది. మౌనిక ఆత్మహత్యకు పాల్పడటంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. మౌనిక ఆత్మహత్యకు యాజమాన్యమే కారణమంటూ ఆమె సహ విద్యార్థులు రాత్రి హాస్టల్ లో ఫర్నిచర్ తగలబెట్టారు. హైదరాబాద్ లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన చెన్నై బయలుదేరి వెళ్లారు. పోస్ట్ మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని స్వస్థలమైన మాటుమడుగు గ్రామానికి తరలించారు.