జొన్న‌వాడ‌లో వైభ‌వంగా దేవీ న‌వ‌రాత్రులు

300

జొన్న‌వాడ‌లో కొలువుదీరిన శ్రీ మ‌ల్లికార్జున స‌మేత కామాక్షితాయి పుణ్య‌క్షేత్రంలో శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. పెన్నాతీరంలోని మ‌ట్టిని తీసుకువ‌చ్చి క‌ల‌శ‌స్థాప‌న చేశారు. అనంత‌రం ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. భ‌క్తులు పెద్ద‌సంఖ్య‌లో ఆల‌యానికి త‌ర‌లివ‌చ్చి అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య ఛైర్మ్ పుట్టా సుబ్ర‌మ‌ణ్యం నాయుడు మాట్లాడుతూ న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో అమ్మ‌వారికి ప‌త్యేక పూజ‌లు, అలంక‌ర‌ణ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు. భ‌క్తులకు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు చెప్పారు.