డీల్ అదిరింది

1065

టాలీవుడ్ లో ప్రెజెంట్ హాట్ కపుల్ ఎవ‌రంటే నాగ చైతన్య, సమంత అని ఠ‌క్కున చెప్పేస్తారు. పెళ్ళికి ముందు వీరిద్ద‌రూ మూడు సినిమాల్లో న‌టించారు. గ‌తేడాది పెళ్ళి చేసుకున్న వీరిద్ద‌రూ ఇప్పుడు ఎవ‌రి సినిమాల‌తో వారు బిజీగా వున్నారు. చైతూ ప్ర‌స్తుతం యుద్ధం శ‌ర‌ణం, స‌వ్య‌సాచి, శైల‌జారెడ్డి అల్లుడు చేస్తుండ‌గా, సామ్స్ ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, యు ట‌ర్న్ ప్రాజెక్టుల‌తో పాటు త‌మిళ చిత్రాల‌తో బిజీగా వుంది. కాగా వీరిద్ద‌రూ మ‌ళ్ళీ క‌లిసి న‌టిస్తారా ? లేదా ?  అని అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సినీ ల‌వ‌ర్స్ కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. చాన్స్ వ‌స్తే తామిద్ద‌రం క‌లిసి న‌టిస్తామ‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వీరిద్ద‌రూ అనౌన్స్ కూడా చేశారు. ఎట్ట‌కేల‌కు వీరి జోడీ తెర‌పై క‌నిపించ‌బోతోంది. ‘నిన్ను కోరి’ మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెర కెక్కించనుండగా షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ లో ఇది తెర‌కెక్కుతోంది. చైతూకి ఇది 17వ సినిమా.

అయితే ఇప్ప‌టివ‌ర‌కు నాగ చైత‌న్య ఒక్కో సినిమాకు రూ.2 నుంచి 3 కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నాడు. శామ్స్ ఒక్కో మూవీకి కోటి వ‌ర‌కు పుచ్చుకుంటోంది. కాగా పెళ్ళి త‌ర్వాత ఆన్ స్క్రీన్ పై క‌లిసి న‌టించ‌నున్న ఈ క్రేజీ కాంబినేష‌న్ కి భారీగా రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్నార‌ట‌. ఏకంగా రూ.7 కోట్ల పారితోషికం ఇచ్చి డీల్ కుదుర్చుకున్నార‌ట మూవీ మేక‌ర్స్‌. పెళ్లి తరువాత ఈ జంట మొదటిసారి కలిసి నటించబోతున్న ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ మూవీకి ‘ప్రేయసి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు టాక్.