డ్రైవర్ కు తీవ్ర గాయాలు..

570

వెంకటగిరి మండలం పాపమంబాపురంవద్ద లారీ ఆటోని ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోని రోడ్డు పక్కన ఆపి డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటుండగా వెనకనుంచి లారీ అతివేగంతో వచ్చి ఢీకొంది. దీంతో ఆటో ఎగిరి పక్కనే ఉన్న పొలాల్లో పడింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.