తప్పిన ప్రమాదం..

1129

ఘాట్ రోడ్ లో భక్తులకు పెద్ద ప్రమాదం తప్పింది. మోకాలి మెట్టు సమీపంలో అక్కగార్లు గుడివద్ద రోడ్డుమీద కొండచరియలు విరిగి పడ్డాయి, చెట్లు విరిగి రోడ్డుకి అడ్డంగా పడ్డాయి. దీంతో రోడ్డు బ్లాక్ అయింది. దాదాగు గంటసేపటికి పైగా తిరుమలలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఘటన జరిగిన సమయంలో అటువైపు ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు.