తెలిసినవారి పనేనా..?

1568

వెంకటగిరిలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బంగ్లాలో చోరీ జరిగింది. దుండగులు రాత్రి వేళ బంగ్లాలో ప్రవేశించి బైక్ మాయం చేసినట్టు గుర్తించారు. బంగ్లా లోపలికి చొరబడటానికి అవకాశం లేకపోవడంతో దొంగలు బైక్ తీసుకెళ్లారు. బంగ్లాలోకి ఇతరులెవరూ రారు కాబట్టి, బైక్ తాళం ఎప్పుడూ దానికే ఉంచుతారు. దీంతో దొంగలు బైక్ ని దర్జాగా బయటకు తీసుకెళ్లి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. స్థానిక బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సీఐ శ్రీనివాస్ వివరాలు సేకరించారు.